
నిమర్జనం కెళ్ళి లోకాన్ని వదిలి వెళ్ళిన యువకులు…..
జాగ్రత్తలు పాటించాలని సూచిన..
పెబ్బేర్ మున్సిపాలిటీ (సి కే న్యూస్)
ఈరోజు ఉదయం సమయం సుమారు 01: 15 గంటల సమయంలో సుచి రెస్టారెంట్ దగ్గర రంగాపురం గ్రామ సమీపంలో హైదరాబాద్ వైపు వెళుతున్న రోడ్డుపై నాచహెల్లి, వనపర్తి మండలం గ్రామానికి చెందిన 12 మంది వ్యక్తులు బీచుపల్లి దగ్గర గణేష్ నిమజ్జనం ముగించుకొని తిరిగి వారి గ్రామానికి ట్రాక్టర్ లో వెళుతుండగా రంగాపురం దాటిన తర్వాత సుచి రెస్టారెంట్ దగ్గర వెనకాల నుండి వస్తున్న ఒక డీసీఎం AP 39 X 1678 గల దాని డ్రైవరు అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను వెనకాల నుంచి ఢీకొట్టడం వల్ల ట్రాక్టర్ ఇంజన్ మీద కూర్చున్నటువంటి 5 మందిలో ఇద్దరు వ్యక్తులు 1) సాయి తండ్రి పేరు శీను వయసు 25 సంవత్సరాలు వృత్తి కూలి పని కులం బోయ నివాసం షర్మిల గ్రామం, రెండవ వ్యక్తి శంకర్డీసీఎం తండ్రి గోవిందు వయసు 28 సంవత్సరాలు పూర్తి కూలి పని నివాసము నాచినెల్లి గ్రామం వనపర్తి మండలం డీసీఎం క్రింద పడి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. మరో ఇద్దరు వ్యక్తులు 1) అబ్దుల్లా తండ్రి గోపాలు, age 20 సంవత్సరాలు వృత్తి వ్యవసాయం కులం.బోయా నివాసం నాచహెల్లి గ్రామం మరియు విష్ణు, తండ్రి మల్లేష్, వయసు 24 సంవత్సరాలు, వృత్తి. జెసిబి ఆపరేటర్, నివాసం నాచహెల్లి గ్రామం లకు గాయాలు అయినవి ట్రాలీలో ఉన్నటువంటి మిగతా ఏడుగురు క్షేమంగా బయటపడడం జరిగింది. ప్రస్తుతం డీసీఎం డ్రైవర్ డీసీఎం వదిలి పారిపోయాడు. మృతులను మరియు గాయపడిన వారిని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.