
భద్రాచలం పట్టణంలో పాయిజన్ తీసుకొని ప్రేమ జంట ఆత్మహత్య.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
సెప్టెంబర్ 05,
భద్రాచలం పట్టణంలోని కరకట్ట (స్మశాన వాటిక) అనుకొని ఉన్న ఒక లాడ్జి లో శుక్రవారం ఉదయం 8.00 గంటల ప్రాంతంలో….
ప్రేమ జంట పాయిజన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో సంచలనంగా మారింది….
యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా… యువతినీ వైద్య నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించిగా కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు సమాచారం…
ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం…..
మృతి చెందిన యువకుడికి ఇదివరకే పెళ్లి కాగా, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం …..
మృతిచెందిన యువకుడి (34) స్వస్థలం కుకునూరు మండలం కాగా…..
యువతి (16) స్వస్థలం అశ్వాపురం మండలం అని తెలుస్తుంది…..
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది……