
సమస్యలు పరిష్కరించాలని ఎంపీకి వినతి
సెప్టెంబర్ 5 ( సీ కే న్యూస్)
ఈరోజు జన్నారం మండల్ బిజెపి అధ్యక్షులు మధుసూదన్ రావు మరియు జిల్లా కౌన్సిల్ సభ్యులు కొంతం శంకరయ్య ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి రోటిగూడ గ్రామానికి ఉన్న సమస్య బండోర్రే మీద హై లెవెల్ వంతెన మరియు మహమ్మదాబాద్ నుంచి రోటిగూడ ఊరు చివరి వరకు 4 కిలోమీటర్ల పొడవు బీటీ రోడ్ నిర్మాణం, మరియు లక్ష్మీదేవి టెంపుల్ రోడ్డు, స్కూల్ నుంచి నల్ల పోచమ్మ వరకు, బాదం పెళ్లి వద్ద అలుగు ఒర్రె బ్రిడ్జి నిర్మాణం మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి పొనకల్ పట్టణంలో రోడ్డు వెడల్పు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఇరువైపులా డ్రైనేజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వివిధ గ్రామాలలో బీటీ రోడ్డు నిర్మాణం గురించి ఎంపీ తో రోటిగూడ బిజెపి నాయకులు, మేడ నరహరి, సేపూరి గోపాల్, ఉప్పు రాజన్న, నీరటి శ్రీనివాస్, శివనూరి శ్రీనివాస్ మాట్లాడడం జరిగింది. ఎంపీ సానుకూలంగా స్పందించి వీలైనంత తొందర ఈ పని చేపిస్తా అని హామీ ఇవ్వడం జరిగింది,