
జీఎస్టీ పన్ను తగ్గించినాం
కొరిజీవనంతో (సగం ప్రాణంతో) ఉన్న దేశ ప్రజలారా !
సెప్టెంబర్ 6 ( సీ కే న్యూస్) మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి
S జలంధర్
పండుగ చేసుకోండి
అని కేంద్ర బీ జే పీ ప్రభుత్వం వారు ప్రకటించారు
బీ సీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ మూల భాస్కర్ గౌడ్ గారు మాట్లాడుతూ 2017లో ప్రవేశపెట్టిన జీఎస్టీ అనే పన్నుల పథకం ద్వారా దేశ ప్రజలను నెలకు లక్ష అరవై వేల కోట్ల నుండి రెండు లక్షల కోట్ల రూపాయల వరకు గత ఎనిమిది సంవత్సరాలుగా పన్నులు వసూలు చేసిన కేంద్ర బిజెపి ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు ఆ పన్నులను తగ్గించినాము పండగ చేసుకోండి ! అని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతా రామన్ గారు కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు దేశ ప్రజలను కోరుతున్నారు. అంటే ఈ 8 సంవత్సరాలు దేశ ప్రజలను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నూట ఇరవై కోట్ల మూల వాసీ వారిని ఆర్థికంగా దోపిడీ చేసి కృంగదీసి ఇప్పుడు ఆ “కొరి జీవనంతో ” ఉన్న దేశ ప్రజలకు జీఎస్టీ పన్ను తగ్గించి “టానిక్” అందజేసినట్టుగా కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రకటించడం విచిత్రం గా ఉంది.అని భాస్కర్ గౌడ్ గారు అన్నారు
ఈ పన్ను ప్రకటించినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు ఇది
గబ్బర్ సింగ్ టాక్స్ అని నామకరణం చేశారు.
అనగా గబ్బర్ సింగ్ అనే పాత్ర షోలే సినిమాలో పెద్ద దోపిడీదారుడు క్రిమినల్ ఆ క్రిమినల్ పాత్ర పేరును ఈ జీ ఎస్ టీ టాక్స్ కు గబ్బర్ సింగ్ టాక్స్ గా నామకరణం చేసినారు.
అలాంటి జీఎస్టీ పన్ను ద్వారా గడిచిన 8 సంవత్సరాలు ఎస్సీ ఎస్టి బీ సీ కులాల 120 కోట్ల దేశ ప్రజలను ఈ జీ ఎస్ టీ పన్ను విధించి ఆర్థికంగా పెద్ద మొత్తంలో దోపిడీ చేసినారు. దేశ మూల వాసి ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి కేంద్ర బీ జే పీ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉన్నదని భాస్కర్ గౌడ్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య గారు, కో కన్వీనర్ కడార్ల నరసయ్య గారు, మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ గారు, కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్ గారు, మున్నూరు కాపు సంఘ నాయకుడు అప్పాల జలపతి గారు, జన్నారం మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్ గారు, ప్రధాన కార్యదర్శి సంద గోపాల్ గారు, మంచిర్యాల డివిజన్ మోకు దెబ్బ అధ్యక్షుడు ఒల్లాల నరస గౌడ్ గారు, పొనకల్ మాజీ ఎంపిటిసి రాగుల శంకర్ గారు, బాదం పెళ్లి మాజీ ఎం పీ టీసీ కాసెట్టి రాజన్న గారు, జన్నారం మండల ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు ఐలవేణి రవి గారు, మహేంద్ర సంఘం నాయకులు కోడిజుట్టు రాజయ్య గారు, పిల్లి మల్లయ్య గారు, ఖానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆండ్ర పురుషోత్తం గారు, మున్నూరు కాపు సంఘం పొనకల్ పట్టణ ఉపాధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ గారు, జన్నారం మండల పూసల సంఘం మాజీ అధ్యక్షుడు గుడ్ల రాజన్న గారు, జన్నారం మండల ఒడ్డెర సంఘం అధ్యక్షుడు కుంట మహేష్ గారు పొనకల్ పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు పొడేటి సతీష్ గౌడ్ గారు, తదితరులు పాల్గొన్నారు.