
నిరుపయోగంగా వాటర్ ప్లాంట్.. ఉపయోగంలోకి వచ్చేది ఎప్పుడో…?
రెండు నెలలు గడుస్తున్నా నేటికీ మరమ్మతులు లేని వాటర్ ప్లాంట్…
తాగునీటి సమస్యల పై కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్న అధికారులు…
పెబ్బేరు సెప్టెంబర్ 07 (సి కే న్యూస్)
మున్సిపాలిటీలోని 9వ వార్డులోని గాంధీ బొమ్మ దగ్గర ఉన్న వాటర్ ప్లాంట్ చెడిపోయి రెండు నెలలు గడుస్తున్నా ఇట్టి సమస్య పై సంబంధిత సిబ్బంది, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ నేటికి మరమ్మతులు చేయించక పోవడంతో కాలనీ వాసులకు తాగునీటి సమస్య కష్ట మైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటువంటి సమస్యలు ఎక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు, సంబంధిత సిబ్బంది అట్టి సమస్య పై తక్షణమే స్పందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేసినప్పటికీ అటువంటి సమస్యలు తమకు పట్టనట్లు వ్యవహరించడం ఏమిటని,ఇదేమైనా వేసవి కాలమా అంటూ స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేయించకుండా ఇంకా ఎన్ని రోజులు ఇలా నిరుపయోగంగా ఉంచుతూ ప్రజలకు ఇబ్బంది పెడతారని, ఇట్టి విషయం పై మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టి తక్షణమే సమస్యను పరిష్కరించాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.