
ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం
పలమనేరు, సెప్టెంబర్ 8, సి కె న్యూస్
జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గురుపూజోత్సవం సందర్భంగా ఎంపికై, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి, చిత్తూరు మరియు పూతలపట్టు ఏంఎల్ఏలు గురజాల జగన్ మోహన్, మురళీ మోహన్ తదితర ముఖ్యుల సమక్షంలో అవార్డు, జ్ఞాపిక ప్రశంసా పత్రం అందుకొన్న ఉపాద్యాయురాలు రమ.
వివరాలు…..
గంగవరం మండలం జి ఎల్ ఎస్ ఫారం జడ్పీ హైస్కూల్ లో, గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ… మొన్న టీచర్స్ డే రోజు, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందిన ఆర్. రమ ను, సోమవారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయశేఖర్ ఆద్వర్యంలో, సన్మాన కార్యక్రమం నిర్వహించి, తోటి ఉపాధ్యాయులు రమా మేడం విద్యార్థులకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో, ఉపాద్యాయులు పట్టాభి,సురేష్, సంగీత సిద్ధమ్మ,సుగుణమ్మ,లక్ష్మీ కళావతి,ప్రమీల,మోక్ష తదితరులు పాల్గొన్నారు.