
ప్రజల సౌకర్యార్థం పుష్కర ఘాట్ల పరిశీలన
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా
సెప్టెంబర్ 10, సెప్టెంబర్ 5 ( సీ కే న్యూస్)
2027 సంవత్సరంలో జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ప్రజల సౌకర్యార్థం పుష్కర ఘాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల గోదావరి పుష్కర ఘాట్ ను మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ లతో కలిసి, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల గోదావరి నది తీరంలోని పుష్కర్ ఘాట్ ను మండల తహసిల్దార్ రఫతుల్లా తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గోదావరి నది తీరంలో సౌకర్యాల కల్పన దిశగా పుష్కర ఘాట్ల వద్ద పరిస్థితులను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. గత పుష్కరాలలో గోదావరి నదిలో పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్టాళ్లు, త్రాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్ ఇతర ఏర్పాట్ల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.