
తల్లితండ్రుల ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యంగా పెట్టుకోండి
మహిళా పాలిటెక్నిక్ కళాశాల యందు అవగాహన సదస్సులో ఎన్ హెచ్ ఆర్ సి సి ఎఫ్ చైర్మన్ మాదేశ్.
పలమనేరు, సెప్టెంబర్ 11, సి కె న్యూస్
పలమనేరు పట్టణంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాల నందు గురువారం మధ్యాహ్నం నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఆధ్వర్యంలో, విలువలతో కూడిన అవగాహన సదస్సును, మాదేశ్ బృందం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మాదేశ్ మాట్లాడుతూ… విద్యార్థిని విద్యార్థులు ఎంతో కష్టపడి తమ ఆశయాలకు అనుగుణంగా చదువుకోవాలని, పిల్లలను తల్లిదండ్రులు చదువు కోసం దూరప్రాంతాలని చూడకుండా పంపించి చదువుకోడానికి కృషి చేస్తున్నారని, చదువుకోవాల్సిన వయసులో ప్రేమ పేరుతో ఆకర్షణలో పడకుండా…తల్లితండ్రుల ఆశయాలను ప్రతి ఒక్కరు నెరవేర్చాలని ఆయన విద్యార్థినీలను ఉద్దేశించి ప్రసంగించారు. తల్లితండ్రుల ప్రేమను ఆయన విద్యార్థినిలకు వివరించారు. ఉన్నతమైన విద్యను అభ్యసించి, ప్రతి ఒక్కరూ…ఉన్నతమైన శిఖరాలను ఆదిరోహించాలని, ఆయన ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ సి సి ఎఫ్ చైర్మన్ మాదేశ్, నేషనల్ జనరల్ సెక్రెటరీ పగడాల మధుమోహన్, నేషనల్ కోఆర్డినేటర్ శివశంకర్, డిస్ట్రిక్ట్ ఉమెన్ వింగ్ ఉపాధ్యక్షురాలు సల్మా, ఆన్సర్ భాష, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.