
మరణించిన కుటుంబానికి కే హెచ్ ఆర్ ఫౌండేషన్ నుంచి ఆర్థిక సహాయం.!!
సి కె న్యూస్ ఆత్మకూర్ ఎం రిపోర్టర్ షేక్ అజీజ్
యాదాద్రి భువనగిరి:- జిల్లా ఆత్మకూరు (యం) మండలం మొదుగుంట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మామిడి శంకర్ రెడ్డి, క్రిష్ణా రెడ్డి తల్లి మామిడి నీలమ్మ అనారోగ్య కారణంగా మరణించారు
వారి కుటుంబాన్ని మొదుగుంట బీఆరెస్ గ్రామ నాయకులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియపరచారు అదేవిధంగా కే హెచ్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల హరిదీప్ రెడ్డి సహాయంతో 5000₹ రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు సోలిపురం తిరుమల్ రెడ్డి, మండల సెక్రెటరీ జనరల్ మామిడి శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు మల్లెపూల ఉపేందర్, మండల నాయకులు సోలిపురం ఎల్లారెడ్డి, పాల సంఘం చైర్మన్ మామిడి రామిరెడ్డి, మామిడి సాంబా రెడ్డి, మామిడి అంజిరెడ్డి, మామిడి ముత్యంరెడ్డి, సోలిపురం వెంకటరెడ్డి, సోలిపురం దేవేందర్ రెడ్డి, ఏనుగు అంజిరెడ్డి, మామిడి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.