
పదో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి
నయీంనగర్లోని ప్రైవేటు స్కూల్ ప్రధాన బ్రాంచ్ విద్యార్థి జయంత్ వర్ధన్(15) ఆటలాడుతూ కుప్పకూలాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దేవన్నపేటకు చెందిన ఆ విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు.
అయితే పాఠశాలలో చదువుతున్న విద్యార్థి మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో విద్యార్థి జయంత్ వర్ధన్ మృతికి పాఠశాల యజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించారు.
పాఠశాల ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించిన విద్యార్థి సంఘాల నేతలు యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బాలుడి కుటుంబానికి యాభై లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇక బాలుడి కుటుంబ సభ్యులు కూడా తన కొడుకు మృతికి పాఠశాల యాజమాన్యం కారణమని ఆరోపించారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.