
మేకల కాపరి పై చిరుత దాడి
సెప్టెంబర్ 11 (సీ కే న్యూస్) చేగుంట
మేకలు కాపరి పై చిరుత పులి దాడి వివరాల ప్రకారం, చేగుంట మండలం కరీంనగర్ గ్రామనికి చెందిన మేకల కాపరి పట్నం రాజు, గ్రామ శివారులోని అడవి ప్రాంతంలో రోజు లాగా మేకలను మేపడానికి వెళ్ళాడు రాజు,
ఒకసారిగా మేకలు అరుస్తుండడంతో గమనించిన రాజు చిరుత పులి మేకల మందిపై దాడి చేస్తుండగా కాపరి కేకలు వేయగా తోటి కాపరులు అకడికి చేరుకొని రాళ్లతో చిరుతపై దాడి చేస్తుండగా చిరుత పారిపోయినట్లు కాపర్లు తెలిపారు,
చిరుతు వెళ్లిపోయిందని గమనించిన తోటి మేకల కాపరులు,వారి మేకల మంద వద్దకు వారు వెళ్లగా, గాయపడిన మేకను రాజు తీసుకుని వస్తుండగా ఒకసారిగా వెనుక నుంచి రాజు పై చిరుత దాడి చేయగా రాజు కిందపడడంతో, రాజుకు స్వల్ప గాయాలు అయ్యాయి, మల్లి రాజు కేకలు వేయగా అక్కడి నుండి చిరుత పారిపోయినట్లు మేకల కాపరులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు.