
కేటీఆర్కు ఆరోజు మగతనం, దమ్ములేదా..? అద్దంకి దయాకర్ ఫైర్
web desc :
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. గద్వాల సభలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ గొంతు చించుకుని మాట్లాడినా, బట్టలు విప్పుకున్నా తెలంగాణ ప్రజలు నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు.
నోరు తెరిస్తే మొగోడివా, దమ్ముందా అని కేటీఆర్ మాట్లాడుతున్నారని.. ఆరోజు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు మగతనం, దమ్ములేదా కేటీఆర్ ?. అందుకే ఆరోజు వారితో రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకున్నావా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వంద ఎలుకలు తిని కాశీ యాత్రకి వెళ్లిన పిల్లిలా…
దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, “వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకి వెళ్లినట్లు, ఇప్పుడు కేటీఆర్ గద్వాలకి వచ్చాడు” అని ఎద్దేవా చేశారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 39 మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి ఆకర్షించి తమ పార్టీలో చేర్చుకున్నారని గుర్తు చేస్తూ, ఇప్పుడు బలమైన తీరు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం కేటీఆర్కు తగదన్నారు. ముగ్గురు ఎంపీలు, 16 మంది ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు నీకు ఈ సంగతులు తెలియవా..? అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డిపై ప్రశంసలు : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని “మొగోడు”గా అభివర్ణించిన దయాకర్, “పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలు ఎదుర్కోవాలని రేవంత్ చెప్పడమే ఆయన ధైర్యాన్ని సూచిస్తుంది అన్నారు.
అదే ధైర్యం కేటీఆర్ కు ఉంటే, ఆయన కూడా ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజల ముందుకు వచ్చేవారని సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని, స్పీకర్ దానిపై చర్యలు తీసుకుంటారు. ఆ విషయాలపై కేటీఆర్ మాట్లాడటం ప్రజలను రెచ్చగొట్టడమే అన్నారు.
తొడ కొట్టి మాట్లాడుతున్నావా కేటీఆర్?
కవితకు ఎదురైన ప్రగాఢమైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కేటీఆర్, ఇప్పుడేమో తొడకొట్టి మాట్లాడుతున్నాడని దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కేటీఆర్ కు అలవాటైందని, ఇది ప్రజలకు ఎప్పుడూ నచ్చదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని, దారుణమైన స్థితిలో ఉన్నా నేతలకు అహంకారం తగ్గడం లేదన్నారు.
కేసీఆర్ – కేటీఆర్ ల పై నిప్పులు చెరిగిన అద్దంకి దయాకర్ “ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పూర్తిగా ఫెయిర్ అయిపోయారు.
ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కూడా ఫెయిల్ అయిపోయాడు. హరీష్ రావు కూడా ఫెయిల్. పార్టీ నుంచి వెళ్లిపోయిన కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దిక్కులేదు అని దయాకర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రజలు నమ్మే రోజులు పోయాయని స్పష్టం చేశారు.
తెలంగాణను వంచించిన వారిని ప్రజలు ఎప్పుడూ మళ్లీ నమ్మరు, అందుకే రెండు సార్లు అవకాశం ఇచ్చిన పార్టీని ప్రజలకు ఇంటికి పంపించారని కౌంటర్ ఇచ్చారు.
గద్వాలకు వెళ్లి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని ఛాలెంజ్ చేశారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
అందుకే ఈరోజు జరిగిన బీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరుకాని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ చెప్పే పనులు చేస్తున్నారని విమర్శించారు.