
మంత్రి పొన్నం కాన్వాయ్ కి తప్పిన ప్రమాదం
మంత్రి పొన్నం ప్రభాకర్ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. సిద్దిపేట నుంచి హైదరాబాద్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్తున్న క్రమంలో కాన్వాయ్ లోని వాహనం కుకునూరు పల్లి గ్రామం వద్ద రాజీవ్ రహదారి డివైడర్ పైకి దూసుకెళ్లింది.
సదరు వాహనం డివైడర్ పై నుంచి సిద్దిపేట వైపు వెళ్లే రహదారి వైపు మళ్ళింది. వాహనంలో పొన్నం ప్రభాకర్ సహాయకుడు మంజునాథ్, ఫోటో గ్రాఫర్, అటెండర్, గన్ మెన్ సాంబశివరావులు ఉన్నారు.
కారులో ఉన్న వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.