Andhra PradeshPolitical

రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురి దుర్మరణం..

రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురి దుర్మరణం..

రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురి దుర్మరణం..

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిన్నారితో సహా ఏడుగురు మరణంచారు. రాంగ్ రూట్ లో వచ్చి మరీ టిప్పర్ కారును ఢీకొట్టింది.

కారు -టిప్పర్ ఢీకొట్టడంతో…

టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో మృతదేహాలు మాత్రం నుజ్జునుజ్జయ్యాయి. కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళుతున్నట్లు సమాచారం.

ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వెంటనే అక్కడకు చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరణించింది ఎవరన్నది ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button