
అంబేద్కర్ విగ్రహం దాడికి ప్రయత్నించిన వ్యక్తిపై చర్యలేవి
రాజ్యాంగం రాసిన అంబేద్కర్ పై దాడి చేసిన పట్టించుకోని అధికారులు
మౌనం వెనక రహస్యం ఏమిటో
సికె న్యూస్ చింతకాని ప్రతినిధి. జి పిచ్చయ్య
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం 2019లో ఏర్పాటు చేయడం జరిగింది… అంబేద్కర్ విగ్రహంపై రాళ్లతో దాడికి ప్రయత్నించారు, అలాగే విరాళాలు ఇచ్చిన దాతలు పేర్లను రాసినటువంటి గ్రానైట్ బండను పూర్తిగా ధ్వజం చేయడం జరిగింది… ఇలా దాడికి ప్రయత్నించిన వ్యక్తి యొక్క ఫొటోస్ వీడియోస్ ఉన్నా కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయంగా మారింది… రాజ్యాంగం రచించిన డాక్టర్ అంబేద్కర్ కి ఇలాంటి అవమానం జరగడం పట్ల అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు…
దాడికి ప్రయత్నించిన వ్యక్తి పై చర్యలు తీసుకుపోతే మండలం మరియు జిల్లా వ్యాప్తంగా ఉదృతం చేస్తాం…