
ఇసుక ట్రాక్టర్లే..యమ పాషాలుగా.
ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం…మరో ప్రాణం బలి..
ఇసుక ట్రాక్టర్ల పై అధికారుల పర్యవేక్షణ లోపం..రోడ్డున పడ్డ…మరో కుటుంబం..
అడ్డు అదుపు లేకుండా.. అక్రమంగా ఇసుకతోలకాలు..
ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఇసుక అక్రమ రవాణా..
నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లు.. లైసెన్సులు లేని డ్రైవర్లు.. ఇన్సూరెన్స్ లేని బండ్లు..
ఇన్సూరెన్స్ ఉంటే..తమకేం కాదనే విచ్చలవీడితనం..
సీసీ కెమెరాలు లేకపోవడంతో ముజాహిద్ పురం కాకరవాయి గ్రామాల నుంచి అర్ధరాత్రి వరకు అక్రమంగా ఇసుక తోలకాలు.
సీకే న్యూస్ ప్రతినిధి కొలిశెట్టి వేణు, తిరుమలాయపాలెం:
రోజువారి కూలీల పట్ల ఇసుక ట్రాక్టర్లు యమపాషాలుగా మారాయి.. తమ పని ముగించుకొని ఇంటికి వెళదామంటే ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రావాల్సిన పరిస్థితి దాపురించింది..
ఏ వైపు నుంచి వచ్చి ఏ ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టి వెళ్లిపోతుందో అని భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు..దీంతో ఓ ఇసుక ట్రాక్టర్ నిర్లక్ష్యమే కుటుంబాన్ని రోడ్డున పడేవేసింది..
తిరుమలాయపాలెం మండలం సుద్ద వాగు తండా గ్రామానికి చెందిన భానోత్ శ్రీను రోజువారి పనులు ముగించుకొని తిరిగి తమ ఇంటికి తిరిగి వస్తుండగా ఓ ఇసుక ట్రాక్టర్ కాకరవాయి గ్రామ శివారులో అతని ప్రాణాలను కబలించింది.. దీంతో అతని కుటుంబం రోడ్డున పడి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది..
అధికారుల పర్యవేక్షణ లోపమే ఇసుక ట్రాక్టర్లు విచ్చలవిడిగా అక్రమ సంపాదనతో చెలరేగిపోతున్నాయని గ్రామ ప్రజలు అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు.. ఓవైపు ఇసుక అక్రమ రవాణా అరికడుతున్నామని పోలీస్,రెవెన్యూ అధికారులు చెబుతున్నప్పటికీ ఇసుక అక్రమ రవాణా అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది..
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇసుక ట్రాక్టర్ల ఓనర్ల కు రెక్కలు వచ్చినట్టయింది.. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్లు లేకపోవడం అరకొరగా డ్రైవింగ్ నేర్చుకొని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రజల ప్రాణాలను విచ్చలవిడిగా తీస్తున్నారు.. ఇసుక ట్రాక్టర్లకు కాగితాలు ఉంటే సరిపోయిద్ది..
బండికి ఇన్సూరెన్స్ ఉంటే సరిపోయిద్ది..మేము ఎలాగైనా డ్రైవింగ్ చేస్తామనే ధరణిలో అధిక వేగంతో డ్రైవింగ్ చేసి ప్రజల పాలిట యమ కింకరులుగా ఇసుక ట్రాక్టర్ల ఓనర్లు తయారయ్యారని కాకరవాయి గ్రామ ప్రజలు సంబంధిత అధికారులపై కన్నెర్ర చేస్తున్నారు..