
లంబాడీలపై జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టాలి .
ఈనెల 28న మహబూబాబాద్ జిల్లా లో జరిగే లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ సభను విజయవంతం చేయండి
ఖమ్మం జిల్లా లంబాడి జేఏసీ నాయకుల పిలుపు
ఖమ్మం : బంజారా భవన్ నందు ఖమ్మం జిల్లా లంబాడి జేఏసీ నాయకుల ఆదివారం సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని ఉద్దేశం సరైంది కాదని , కొంతమంది నాయకులు ఎస్టీలను అడ్డుపెట్టుకుని వారి స్వార్ధ రాజకీయం కోసం కుట్ర పన్నుతున్నారని ఈ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు .
ఇన్ని సంవత్సరాలు అన్నదమ్ములుగా కలిసి ఉన్న కొయ్య లంబాడి ఇతర ఎస్టి నాయకులు విడగొట్టి విభజించు పాలించు అనే అంశంతో రాజకీయం చేయాలని చూస్తున్నారని దీనిని గమనించాలని కోరారు .
ఈనెల 28 న మహబూబాబాద్ జిల్లా జరిగే లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ సభను విజయవంతం చేయడానికి అధిక సంఖ్యలో బంజారాలు తరలి రావాలని సూచించారు .
లంబాడీల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా లంబాడీలను ఎస్పీ జాబితా నుండి తొలగించాలని కొంతమంది చేస్తున్న కుట్రను లంబాడి జేఏసీ పూర్తిగా ఖండించింది. దీనికి నిరసనగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ సభను విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది .
ఈ కార్యక్రమంలో ఖమ్మం లంబాడి జేఏసీ నాయకులు బానోత్ వీరు నాయక్ , Dr. రాజ్ కుమార్ జాదవ్ , బానోత్ కిషన్ , బిక్షపతి రాథోడ్ , ధరావత్ రామ్మూర్తి , జర్పుల బాలాజీ , బానోత్ బస్కి నాయక్ , రవి రాథోడ్ , హరి నాయక్ , రాందాస్ ఏ డి , శోభన్ నాయక్ , సోమ్లా నాయక్ , రాంబాబు రాథోడ్ , మంగీలాల్ జాదవ్ , మంగ్య నాయక్ , శ్యామ్ లాల్ , రాజ్ కుమార్ , హీరాలాల్ , రాందాస్ , కిషన్ రాథోడ్ , సీతారాం , వీరు , దేవా, బాలాజీ , రాము , రాంజీ , కిషన్ , బాసు , తులసి రామ్ , వీరన్న , రవి , శాంతి కుమార్ , రాంబాబు , రమేష్ , డాక్టర్ బాలు , ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు .