
ఈనెల 26న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఆమరణ దీక్షకు సంపూర్ణ మద్దతు .
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డా కే.వి. కృష్ణారావు
సెప్టెంబర్ 26వ తేదీన ఖమ్మం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి పర్యవేక్షణ లో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్ బి సి లకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు . ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డా కే.వి.కృష్ణారావు పేర్కొన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి బి.సి.డిక్లరేషన్ సభలో బి.సి.లకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేసిందని , దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారామ్ లో కి వచ్చాక అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం కి పంపింది . రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 42 % రిజర్వేషన్ ను అమలు జరిగేలా చూడాలని ఏవిధమైన అడ్డంకులు వచ్చినా వాటిని కాంగ్రెస్ పార్టీ పరిస్కరించి ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని , ఆ దిశగా అడుగులు వేయాలని డిమాండ్ చేశారు . బి.సి.ల స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసం ఆమరణ దీక్ష కు పూనుకోవటమనేది చాలా గొప్ప విషయం అని అన్నారు . ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని బి.సి.సంఘాలు పార్టీల కి అతీతంగా బీసీలు అందరూ మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి , తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ పసుపులేటి నాసరయ్య , మహాత్మా జ్యోతిబా ఫూలే ఐడియాలజీ సొసైటీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పెళ్ళూరి విజయకుమార్ , తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డబోయిన వరలక్ష్మి , కామని అనంత లక్మి , జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లారావు గౌడ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ , టౌన్ అధ్యక్షుడు మల్లికార్జున్ , జిల్లా యూత్ అధ్యక్షుడు కూరపాటి సతీష్ , టౌన్ మహిళా అధ్యక్షురాలు గాజుల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు .




