
వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి….
నాది తప్పులేదని వాపోతున్న:- వైదుడు
వైద్యులు సకాలంలో వైద్యం అందించకపోవడంతో బాలిక మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపణ…
బ్రేకింగ్ న్యూస్
పెబ్బేరు మున్సిపాలిటీ (సి కే న్యూస్)
వైద్యుల నిర్లక్ష్యంతోనే ఓ బాలిక మృతిచెందిన సంఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో వెలుగుచూసింది. మృతురాలి కుటుంబ సభ్యులు, తెలిపిన వివరాల ప్రకారం…వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన శిరీష,రాముడు దంపతుల కూతురు రమ్య(05) ఆదివారం తెల్లవారుజామున కడుపునొప్పితో బాధపడుతుండగా
దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చిన్నారిని చికిత్స నిమిత్తం పెబ్బేరు పట్టణంలోని జనని హాస్పిటల్‌కు తీసుకొచ్చారు.
హాస్పిటల్‌కు తీసుకొచ్చి తమ కూతురుని కాపాడాలని ఆస్పత్రి వైద్యులను వేడుకున్నారు.దీంతో ఆసుపత్రి వైద్యులు రెండు ఇంజక్షన్ ఇచ్చారు.
తర్వాత బాలికకు కడుపు నొప్పి ఎక్కువ కావడంతో లోపల పేగు మడత పడిందని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఉచిత సలహ ఇచ్చారు.అక్కడి నుంచి మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పెబ్బేరు ప్రవేట్ ఆసుపత్రి వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో పరిస్థితి విషమించి రమ్య మృతి చెందిందని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు.విషయం తెలుసుకున్న రమ్య బంధువులు ఆస్పత్రికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.




