
పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త.. రూ. 104 కోట్ల బిల్లులు విడుదల
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు మరో శుభవార్త అందించింది. వారికి చెల్లించాల్సిన రూ. 104 కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
గత కొన్నిరోజులుగా పెండింగ్ బిల్లుల విడుదల కోసం పంచాయతీరాజ్ కార్యదర్శులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులు బిల్లులకు సంబంధించి రూ.104 కోట్లు విడుదల చేసింది. దీంతో పంచాయతీ కార్యదర్శుల బిల్లులకు మోక్షం కలిగినట్లు అయ్యింది.
ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఏకకాలంలో పెద్దమొత్తంలో పెండింగ్ బిల్లులను విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కలకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. అయితే, ఈ నిధులు పంచాయతీ కార్యదర్శుల ఖాతాల్లో జమకానున్నాయి.
పంచాయతీ కార్యదర్శులకు ఒకేసారి భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. పంచాయతీ కార్యదర్శుల బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం బిల్లులు విడుదల చేసింది. దీంతో పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ అయ్యాయి.
మరోవైపు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ బిల్లుల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కల దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వం ఒకేసారి రూ.104 కోట్ల బిల్లులను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పంచాయతీ కార్యదర్శులపై ఉన్న ఒత్తిడి తగ్గి ఊరటనిచ్చినట్లు అయ్యింది.




