
KCRకు బిగ్‌షాక్.. BRSను వీడనున్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య!
Web desc : బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కారు పార్టీని వీడుతున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ లో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్లో చేరేముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు. కాంగ్రెస్ పార్టీ పీసీసీగా కూడా పని చేశారు. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్లోకి తిరిగి రావాలంటూ సోషల్ మీడియాలో పొన్నాల అభిమానుల పోస్టులు పెడుతున్నారు.
2023అసెంబ్లీ ఎన్నికల ముందు పొన్నాల బీఆర్ఎస్లో చేరారు. కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు పొన్నాల లక్ష్మయ్య దూరంగా ఉంటున్నారు.
ఆయన సొంతగూడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పొన్నాల చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిలో ఎంత నిజమే తెలియాల్సి ఉంది.




