
మద్యం మత్తులో వేధింపులు.. నడిరోడ్డుపై చెప్పుతో కొట్టిన యువతి
మద్యం మత్తులో వేధింపులకు పాల్పడిన ఓ యువకుడిని నడిరోడ్డుపై యువతి చెప్పుతో కొట్టింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం హౌసింగ్ బోర్డులో చోటు చేసుకుంది. మద్యం మత్తులో యువకుడు రోడ్డుపై నిలుచుని పిచ్చి చేష్టలు చేశాడు.
వచ్చి పోయే వాహనాలకు అడ్డుపడుతూ వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాకుండా స్కూటీపై వెళుతున్న ఓ అమ్మాయిని ప్రేమించాలని వేధించాడు. దీంతో ఆ అమ్మాయి, స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేశారు.
యువతి అతడిని రోడ్డుపైనే చెప్పుతో కొట్టింది. ఈ క్రమంలో కొందరు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని సైతం కొట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని రిమాండ్ కు తరలించారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.




