HyderabadPoliticalTelangana

చలో బస్ భవన్‌కు పిలుపు.. హరీశ్ రావు, KTR హౌస్ అరెస్ట్

చలో బస్ భవన్‌కు పిలుపు.. హరీశ్ రావు, KTR హౌస్ అరెస్ట్

చలో బస్ భవన్‌కు పిలుపు.. హరీశ్ రావు, KTR హౌస్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఆర్టీసీ సిటీ బస్సుల చార్జీల పెంపునకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్‌కు పిలుపునిచ్చారు.

ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గం నుంచి బస్‌భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించనున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. బీఆర్‌ఎస్‌ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు.

గురువారం ఉదయమే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌ రావును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో కోకాపేటలోని వారి నివాసాల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

ఇక, చలో బస్‌భవన్‌ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR), మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్‌ బస్టాండ్‌కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్‌భవన్‌ వరకు వెళ్లాలని ప్లాన్‌ చేసు​కున్నారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button