
చల్లారిన రాజకీయ వేడి
మధిర నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి సద్దుమణిగింది
సి కె న్యూస్ చింతకాని ప్రతినిధి.
మధిర నియోజకవర్గంలో ఎగిసిపడిన రాజకీయ ఉత్సాహం ఇప్పుడు సడెన్‌గా చల్లారిపోయింది. మండలాల్లో రాజకీయ నాయకులు ఒక్కసారిగా శాంతించినట్లుగా కనిపిస్తున్నారు.
అప్పటివరకు పొత్తులు, ఎత్తులు, అభ్యర్థుల ఎంపికలపై మల్లగుల్లాలు పడిన రాజకీయ నేతల హడావిడి, వర్షం వచ్చి ఆగినట్టుగా తక్షణమే క్షీణించింది.
ఎన్నికల వాతావరణం మూగబోయింది
మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉత్సాహంగా సాగిన ఎన్నికల చర్చలు, వ్యూహ రచనలు, సభా చట్రాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో రాజకీయ వాతావరణం మూగబోయింది.
“హమ్మయ్య, భలే పని అయింది” అంటూ కొందరు ఊపిరి పీలుస్తుండగా, మరికొందరు మాత్రం “ఇంతలోనే ఉత్సాహం ఆగిపోవడం బాధకరం” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
కోర్టు స్టే ప్రభావం
ఎన్నికల ప్రక్రియపై కోర్టు విధించిన స్టే కారణంగా రాజకీయ వేడి తాత్కాలికంగా చల్లారిపోయింది. కనీసం నెలరోజుల పాటు ఈ హడావిడి కి బ్రేక్ పడినట్లే అయింది. పక్షానికీ, ప్రతిపక్షానికీ ఇది అనూహ్య విరామం లాంటిదిగా మారింది.