
గిరిజన యువకుడిపై దాడికి పాల్పడిన పోలీస్ అధికారులపై విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకోండి.
- జాతీయ మానవ హక్కుల కమిషన్
గత నెల నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కొత్తపేట తండాకు చెందిన సాయి సిద్దు అనే గిరిజన యువకుడు యూరియా కోసం ధర్నాలో పాల్గొన్నాడనే కారణంతో అతడిని చట్ట వ్యతిరేకంగా ఇంట్లో నుంచి లాక్కెళ్లి కులం పేరిట దూషిస్తూ,
ఇష్టానుసారంగా కొట్టి అక్రమ కేసులు బనాయించి ఆ విషయాన్ని న్యాయమూర్తి ఎదుట చెప్తే మళ్లీ కొడతామని వాడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మరియు కానిస్టేబుల్ బెదిరించినట్టు అదేవిధంగా బాధితుడి భార్య దీనాను కూడా దుర్భాషలాడిన సంఘటనపై న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ ఫిర్యాదుపై నేడు విచారించిన జాతీయ మానవ హక్కుల సంఘం రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించిన ఈ సంఘటనపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణ చేపట్టి సంఘటనకు కారణమైన ఎస్ఐ మరియు కానిస్టేబుళ్లను విధుల నుండి తొలగించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసులు నమోదు చేయాలని నల్గొండ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
అదేవిధంగా బాధితుడికి సరైన వైద్య సదుపాయం అందించి నష్టపరిహారం కూడా చెల్లించి పూర్తి నివేదిక నాలుగు వారాల్లోపు కమిషన్ కు తెలపాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.