
గోవిందాపురం(ఎల్ ) గ్రామంలో క్రైస్తవ మందిరం కూల్చడం పై పలు అనుమానాలు..
సి. కె న్యూస్, చింతకాని ప్రతినిధి
పేద దళిత ప్రజల భూములను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెర లేపింది ఎవరు?
తెలంగాణ ప్రభుత్వం 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణమే ఓ వరమా..
గతంలో వేటికీ పనికిరాని భూములకు భారీ మొత్తంలో రెక్కలు…
పది లక్షల కూడా పలకని ఎకరం భూమి నేడు కోటి రూపాయల వరకు పలికే అవకాశం.
నాలుగు గ్రామాలను కలుపుతూ ఏర్పడిన రింగ్ రోడ్…
చుట్టుపక్కల భూములపై రియల్టర్ల కన్ను పడిందా
ఆక్రమంలోనే చుట్టూ ఉన్న భూములను కాజేసేందుకు స్కెచ్ నడుస్తుందా చర్చి నిర్మాణం కూల్చడానికి కారణం ఇదే అయి ఉంటుందా రియాల్టర్లకు సహకరిస్తున్నది ఎవరు ?కంటి తుడుపు చర్యగా అధికారుల సందర్శన .
ప్రశ్నించాల్సిన మత సంఘాల మౌనానికి కారణం ఏమిటి
అధికారుల అలసత్వానికి కారణం ఏమై ఉంటుందో అని స్థానికుల గుసగుసలు.. చేస్తున్నది ఎవరు చూస్తున్నది ఎవరు… అని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు