
ప్రభుత్వ భూమినే కాదు ప్రైవేట్ భూమిని కబ్జా చేసిన మార్వాడీ మాఫియా ఓం నారాయణ……..!
ప్రభుత్వ భూమి కబ్జా కోసం గతంలో అంబేద్కర్ భవనాన్ని కూల్చింపచేసిన తీవ్రవాది పై చర్యలు తీసుకోవాలి…..
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్,భూ బాధితుడు పరకాల రాజేశ్వర్ రెడ్డి…….
మహబూబాబాద్ ప్రజా ప్రతినిదుల అండతో రెచ్చిపోతున్న భూ మాఫియా డాన్ ఓం నారాయణ……!
తాజాగా ఓ ఎమ్మార్వో ని కలవగా ఆది ప్రభుత్వ భూమినే, కానీ నేను ఏం చేయాలేను,ఏదైనా చేస్తే నా ఉద్యోగం పోతుందని బదులిచ్చాడు……
ప్రభుత్వ భూమిని కాజేశాడు అని నిర్ధారణ జరిగిన స్పందించని జిల్లా కలెక్టర్, తహసిల్దార్ రెవెన్యూ అధికారులు
సర్వే నంబర్ 551లో 30 ఎకరాలు,సర్వే నంబర్ 107 లో 1.34 గుంటల ప్రభుత్వ భూమిని,ప్రైవేట్ భూమి సర్వే నంబర్ 106 లో 249 గజాలు, 106/1 లో 585 చ.గజాల భూమిని ఆక్రమించిన మార్వాడీ ఓం నారాయణ
ఇకపై బాధితుడితో కలిసి అన్ని సంఘాలను కలుపుకొని దశలవారీగా నిరాహారదీక్షలు
ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్….
*మహబూబాబాద్ సి కె న్యూస్ ప్రతినిధి*
మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ భూమి దోపిడీదారుడు, సర్వేనెంబర్ 551 లో 30 ఎకరాలు, సర్వే నెంబర్ 107 లో రెండు ఎకరాలు 1.34 గుంటల భూమిని, ప్రైవేట్ భూమి 106 లో 249 గజాల భూమిని,సర్వే నంబర్ 106/1 లో 585 చ.గజాల భూమిని అక్రమించిన మార్వాడి మాఫియా ఓం నారాయణ లోయపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేసి జైలుకి పంపించాలని ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్ డిమాండ్ చేశారు….గత 8 నెలల నుండి జిల్లా కలెక్టర్, తహసిల్దార్, రెవెన్యూ అధికారులు లకు వినతులు ఇచ్చిన కనీసం స్పందించడం లేదని అన్నారు.. స్పందించనే అధికారులను సస్పెండ్ చేయాలని, ప్రభుత్వ భూమిని మరియు ప్రవేట్ భూమిని ఆక్రమించిన ఓం నారాయణ పై చర్యలు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ దశలవారిగా నిరాహార దీక్షలు చేపడుతున్నామని భీమా నాయక్ తెలిపారు…. బడా బుకాసురులను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తుంది అని తెలిపారు….. నిరుపేదలు జాగలేక గుడిసెల వేసుకుంటే బుల్డోజర్లు పెట్టీ కూల్చేస్తున్నారని,కానీ అక్రమ నిర్మాణాలు చేపట్టిన బిల్డింగ్లు లని ఎందుకు కూల్చడం లేదని తెలిపారు.. ప్రభుత్వ భూములను రక్షించలేని అధికారులు తక్షణమే రాజీనామా చేసి ఇంటికి వెళ్లి పోవాలని, లేనియెడల భవిష్యత్తులో జరిగిన ప్రతిపరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు… ఇప్పటికీ మా ఓపిక నశించిందని ఇకపై ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యామని తెలిపారు..ఈ మీడియా సమావేశంలో ఎల్ హెచ్ పీఎస్ నాయకులు మంగిలాల్ నాయక్, ధరంసౌత్ బాలు నాయక్,శ్రీను నాయక్, బానోత్ వీరు నాయక్, వీరన్న, అనిల్ తదితరులు పాల్గొన్నారు…..