
జన్నారంలో బీ సీ సంఘంచే రాస్తా రోకో !
మంచిర్యాల జిల్లా
అక్టోబర్ 13 ( సీ కే న్యూస్)
జాతీయ మరియు రాష్ట్ర బీ సీ సంఘాల పిలుపు ననుసరించి జన్నారం మండల బీసీ సంఘం తరఫున జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా నేడు జన్నారం మండల కేంద్రములో రాస్తా రోకో నిర్వహించడం జరిగింది .
ఈ సందర్భంగా బీ సీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో కుల గణన చేపట్టడమూ అసెంబ్లీలో బీ సీ బిల్లు ప్రవేశపెట్టే ఆమోదించడమూ గవర్నర్ గారికి బిల్లును పంపించడం చివరికి జీ ఓ నెంబర్ 9 నీ విడుదల చేయడం జరిగినది. ఈ విషయంగా రెడ్డి జాగృతి సంఘం తరఫున గౌరవనీయ హైకోర్టులో కేసు వేయడం వలన స్టే విధించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయినాయనీ స్టే వేకేట్ చేసి 42 శాతం బీ సీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ నేడు రాస్తా రోకో నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ కడార్ల నరసయ్య గారు మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ గారు, జన్నారం మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్ గారు, మాజీ ఎంపిటిసి రాగుల శంకర్ గారు, ప్రధాన కార్యదర్శి సంద గోపాల్ గారు, మామిడి విజయ్ గారు, ముదిరాజ్ సంఘం మండల ఉపాధ్యక్షుడు ఐలవేణి రవి గారు, మహేంద్ర సంఘం నాయకుడు పిల్లి మల్లయ్య గారు కోడి జుట్టు రాజయ్య గారు , ఒడిపెల్లి రామన్న గారు, ఒడిపెల్లి రాజేష్ గారు, ఖానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆండ్ర పురుషోత్తం గారు, పూసల సంఘం మాజీ అధ్యక్షుడు గుడ్ల రాజన్న గారు, మంచిర్యాల జిల్లా కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్ గారు, మున్నూరు కాపు సంఘం పొనకల్ పట్టణ ఉపాధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ గారు ముంజంపెల్లి సాయి గారు, కనికరపు గంగాధర్ గారు గడ్డం సత్తయ్య గారు, ఈర్ల రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు.