
టేకు చెట్లు నరికిన వ్యక్తికి రిమాండ్
మంచిర్యాల జిల్లా //
అక్టోబర్ 13( సీ కే న్యూస్)
తానిమడుగు బీట్ పరిధిలో టేకు చెట్ల నరికివేతపై వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా, తాళ్లపేట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్యవేక్షణలో రేంజ్ సిబ్బంది మరియు డాగ్ స్క్వాడ్ బృందం సంయుక్తంగా 394వ కంపార్ట్మెంట్లో తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా అక్కడ నరికిన టేకు చెట్ల వద్ద లభించిన ఆధారాలను డాగ్ హంటర్‌కు వాసన చూపించగా, సుమారు 4 కిలోమీటర్ల దూరం వరకు ట్రాక్ చేస్తూ తానిమడుగు గ్రామంలోని పెందుర్ రాజేష్ అనే వ్యక్తి ఇంటివరకు చేరింది. ఆ ఇంటి వద్ద కూడా టేకు కలప లభించింది.
దీనితో రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా, ఆయన నేరాన్ని అంగీకరించాడు. అనంతరం సంబంధిత కేసు నమోదు చేసి, నిందితుడిని లక్సెట్టిపేట్ కోర్టులో హాజరు పరచగా, గౌరవ మేజిస్ట్రేట్ గారు 12 రోజుల రిమాండ్ విధించారు.