
జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గెలుపే లక్ష్యంగా పగడాల నాగరాజు విస్తృత ప్రచారం
హైదరాబాద్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి BRS పార్టీ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గారి గెలుపునే లక్ష్యంగా, వెంగళరావు నగర్, సిద్ధార్థ నగర్ పరిధిలోని 78 పోలింగ్ బూత్ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ప్రజలను ఉద్దేశించి కారు గుర్తుపై ఓటు వేసి ఘన విజయం సాధించగలరని కోరుతూ ప్రచారం నిర్వహించిన ఖమ్మం బి ఆర్ ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు గారు, స్థానిక BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజల్లో ఉత్సాహం నింపారు.
ప్రచారం సందర్భంగా స్వర్గీయ మాగంటి గోపీనాద్ గారి ప్రజా సేవా కార్యక్రమాలను వివరించి, ఆయన చేపట్టిన అభివృద్ధి పథాన్ని కొనసాగించేందుకు శ్రీమతి సునీత గారిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
“కారు గుర్తు… ఒకే ఓటు… అభివృద్ధి బాటలో జూబ్లీహిల్స్” అనే నినాదాలతో గళమెత్తారు.
అదేవిధంగా, ప్రతి ఇంటికీ కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రతి ఒక్కరికి బాకీ పడిందని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రేస్ పార్టీ వైఫల్యాలను చాటిచెప్పుతూ “బాకీ కార్డులు”ను ఇంటింటికి పంపిణీ చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం ప్రతినిధులు, యువజన విభాగం కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు