
అక్రమంగా నరుకుతున్న జామాయిల్ ప్లాంటేషన్..!!
అక్రమార్కులకు అధికారుల అండదండలు ఉన్నాయంటున్న ప్రజలు
ఈ చీకటి దందాలో ఎంతమంది అధికారుల హస్తం ఉంది
సి కె న్యూస్ ప్రతినిధి బాదావత్ హాతిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో
అడవిని కాపాడవలసిన అధికారులే అక్రమార్కుల తో చేతులు కలిపి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి అడవి బీట్ పరిధిలో చోటుచేసుకుంది ప్లాంటేషన్లో పెరుగుతున్న జామెయిల్ చెట్లను కొందరు అక్రమంగా నరికి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ట్రాక్టర్ తోటి జామాయిల్ కర్రలను తీసుకెళ్తుండగా ఈ విషయం గ్రామస్తులకు తెలియజేయడంతో నరికిన జామెయిల్ కర్రలను ఓరైతు కు చెందిన పామాయిల్ తోటలో దాచి పెట్టారు విషయం తెలుసుకున్న డిప్యూటీ రేంజ్ అధికారి నజర్ బీ తోట వద్దకు వెళ్లి నరికిన చెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం అడవి అధికారుల అండదండలతోని నడుస్తుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇట్టి విషయమై డిప్యూటీ రేంజ్ అధికారి ని వివరణ కోరగా కొందరు వ్యక్తులు అక్రమంగా జమాల్ చెట్లు నరికి ట్రాక్టర్లు లొ తరలిస్తున్న రన సమాచారం మేరకు జమాయిల్ కర్రలను అదుపులోకి తీసుకున్నామని అన్నారు . ఇట్టి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.