
జిల్లా కార్యదర్శిగా ప్రవీణ్
బీజేవైఎం నిర్మల్ జిల్లా కార్యదర్శిగా
అక్టోబర్ 21 ( సీ కే న్యూస్)
మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన ముడుగు ప్రవీణ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రవీణ్ ఇప్పటివరకు బీజేవైఎం జన్నారం మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. బిజెపి పార్టీ బలోపేతానికి చేసిన సేవలను గుర్తించి ఆయనను బీజేవైఎం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. బిజెపి బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.