
ఇందన్ పల్లి రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
అక్టోబర్ 23 ( సీ కే న్యూస్)
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందన్ పల్లి ఐబీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఎదురెదురుగా బొలెరో వాహనం, బైక్ ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.