
కారును ఢీకొన్న లారీ.. నలుగురు ఎమ్మెల్యే బంధువుల మృ*తి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్యవతి పేట శివారులో కారు, లారీ ఢీకొనడంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు.
ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలి, చికిత్స అందిస్తున్నారు. మృతులు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బంధువులుగా పోలీసులు గుర్తించారు.
MLA కుమారుడి వివాహ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సంగీత్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆదివారం (నవంబర్ 02) అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ సమయంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులను కర్లపాలెంకు చెందిన బేతాళం బలరామరాజు (65), బేతాళం లక్ష్మి (60), గాదిరాజు పుష్పవతి (60), ముదుచారి శ్రీనివాసరాజు (54)గా గుర్తించారు.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 13, 11 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వాళ్లకు ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు.
బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



