
వివాహిత ఆత్మ*హత్య…
బాన్సువాడ పట్టణంలో ఓ వివాహిత ఆత్మ*హత్యకు పాల్పడినట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు. వివరాలు ఇలా.. పట్టణానికి చెందిన గొడుగు కాశీనాథ్‌కు, కంగ్టి మండలానికి చెందిన అపర్ణకు(30) 2019లో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.
ఆదివారం ఉదయం అపర్ణకు ఆమె అత్త సాయవ్వకు మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో అపర్ణ ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. వెంటనే స్థానికులు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అక్కడి వైద్యులు నిజామాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. కానీ బాన్సువాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు తీవ్రంగా శ్రమించిన ఫలితం లేకుండా పోయింది. అపర్ణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.



