
26 లక్షల గంజాయి స్వాధీనం.
51.9 కేజీల గంజాయి పట్టివేత.
కారు బైకు సీజ్ .
ముగ్గురిపై కేసు నమోదు.. ఇద్దరు అరెస్ట్.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, (సాయి కౌశిక్),
నవంబర్ 05,
ఒరిస్సా నుంచి గంజాయి కేరళాకు కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై శ్రీహరి రావు సిబ్బంది కలిసి భద్రాచలం కూనవరం క్రాస్ రోడ్ వద్ద పట్టుకున్నారు. కారు ఇంజన్ లో తనిఖీలు నిర్వహించగా గంజాయి పాకెట్లు కనిపించాయి.
లభించిన గంజాయి పాకెట్లను తూకం వేయగా 51.9 నైన్ కేజీల గంజాయిగా ఉంది.
పట్టుకున్న గంజాయి విలువ రూ. 26 లక్షలు గా ఉంటుందని అంచనా వేశారు. గంజాయి తో పాటు కారు ఒక బైకును కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో కేరళకు చెందినటువంటి జకారియా పర్యాల్, నసిర పూర్తియా వేట్టల్ లను అరెస్ట్ చేశారు.
ఈ కేసులో కందుల రవి సూర్యాపేటకు చెందిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు ఇతను పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఇద్దరు వ్యక్తులను గంజాయిని కార్లను భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ సిఐ కి అప్పగించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గంజాయిని పట్టుకున్నట్లు ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ గణేష్ తెలిపారు.
ఈ కేసును కరం చంద్ ఏఈ ఎస్ దర్యాప్తు నిర్వహించనున్నారు. గంజాయిని పట్టుకున్నటువంటి ఎక్సైజ్ సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ కాసిం అభినందించారు.



