
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పౌర సరఫరాల శాఖ అధికారి!
కొమురం భీం జిల్లా : ఓ రైస్ మిల్ యజమాని వద్ద జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి 75 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
గురువారం రాత్రి పౌర సరఫరాల శాఖ మేనేజర్ నర్సింగరావు రూ.75వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం..
దహేగాంకు చెందిన సందీప్ వాసవి మోడ్రన్ రైస్ మిల్లుకు ప్రభుత్వం ఇచ్చిన వడ్లను మిల్లులో పీడీఎఫ్ బియ్యం గా మార్చి గోదామ్ కి తరలించేందుకు నాణ్యత లోపం ఎన్వోసీ ఇవ్వాలని జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ నర్సింగరావును రైస్ మిల్లు యజమాని కోరాడు. అయితే రూ.25వేలు చొప్పున మూడు లారీలకు రూ75వేలు మొత్తం లంచం డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు ఏసీబీనీ ఆశ్రయించాడు. గురువారం రెబ్బెన మంచిర్యాల రోడ్డుపై లంచం తీసుకుంటుండగా వెంబడించి నర్సింగరావుతో పాటు టెక్నికల్ అసిస్టెంట్ మణికంఠలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారించగా.. 16 లారీలకు లంచం తీసుకున్నట్టు తెలిపారు.
అధికారులు ఎవ్వరైనా లంచం కోసం సామాన్య జనాన్ని వేధింపులకు గురి చేస్తే 91543-88963 అదిలాబాద్ ఏసీబీ డిఎస్పి ఈ నెంబర్ ఆశ్రయించాలని ఆయన కోరారు.



