
కలిసి నిలిచిన కాంగ్రెస్ కుటుంబం మల్లేశ్ కుటుంబానికి ₹1,04,000 సహాయం అందజేత
సి కె న్యూస్ ఆత్మకూర్ ఎం రిపోర్టర్ షేక్ అజీజ్
కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందించిన మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు బత్తిని మల్లేశ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మనల్ని శాశ్వతంగా విడిచిపెట్టడం మనందరికీ ఎంతో బాధాకరం. ప్రస్తుతం వారి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది…
వారి ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు కోసం మనందరం కలసి అండగా నిలుద్దాం అనే భావంతో ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వాట్సాప్ గ్రూప్‌లో తెలియజేయగానే, మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని అందించారు.
అందరి సహకారంతో ₹1,04,000 (ఒక లక్ష నాలుగు వేల రూపాయలు) మొత్తాన్ని ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది…
ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్ మాట్లాడుతూ మన కాంగ్రెస్ కుటుంబం చూపించిన ఈ మానవతా విలువలు నిజంగా అభినందనీయమైనవి. ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్త ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే మనం ఎల్లప్పుడూ కలసి వారికి అండగా నిలబడుతున్నాం…
ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఐక్యంగా నడుచుకోవాలని కోరుకుంటూ…బత్తిని మల్లేశ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాం… ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి, PACS చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్, మాజీ ఎంపీటీసీ దిగోజు నరసింహ చారి, BC సెల్ మండల అధ్యక్షులు కట్టేకోల హనుమంతు, OBC సెల్ మండల అధ్యక్షులు బత్తిని ఉప్పలయ్య,పట్టణ శాఖ అధ్యక్షులు పోతగాని మల్లేశం,మత్స్యపారిశ్రామిక సంఘం మండల అధ్యక్షులు ఎద్దు వెంకన్న,గౌడ సంఘం అధ్యక్షులు పంజాల నర్సయ్య గౌడ్, BC సెల్ పట్టణ అధ్యక్షులు ఎలగందుల శ్రీనివాస్,పట్టణ ఉపాధ్యక్షులు ఉగ్గె నరేష్,OBC సెల్ జిల్లా కార్యదర్శి ఎలగందుల మహేష్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిత్తర్ల అనిల్,యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుండెగాని కిరణ్,ప్రధాన కార్యదర్శి యాస మురళి,NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి తొండల అనిల్ కుమార్,NSUI పట్టణ అధ్యక్షులు లోడి మహేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రంగ స్వప్న–స్వామి,పైల్ల దామోదర్ రెడ్డి,శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ డైరెక్టర్లు దిగోజు శ్రీనివాస చారి,కొంగరి పరుషరాములు,మాజీ వార్డు సభ్యులు కోరే మల్లేశ్, కానుకుంట్ల యాదగిరి, ఎలిమినేటి మురళి కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టేకోల అబ్బసాయిలు, జన్నాయికోడె యుగంధర్,ఎనుగు రాజిరెడ్డి, ఎండీ జహంగీర్,మోలుగురి సత్యనారాయణ,రాగటి సత్యనారాయణ,ఎండీ మజీద్,వెలమకన్నె స్వామి, దిగోజు రమేష్ చారి, తవిటి రాజు,బద్ధుల వెంకన్న,కొంగరి విద్యాసాగర్,గట్టు శేఖర్, రాగటి శ్రీశైలం,లోడి రాజు, గడ్డం హరీష్,దిగోజు సురేంద్ర చారి, సురారం శ్రీకాంత్, గట్టు రాజు, కోరే మహేష్, రాచమల్ల ప్రసాద్, కోల ముకేశ్,కోరే హరీష్, గట్టు అజయ్, నాగం సందీప్, చేపూరి సోమేశ్వర్ సాయి,చందు తదితరులు పాల్గొన్నారు…



