PoliticalTelangana

రానున్న రోజుల్లో అధికారం మనదే…!

రానున్న రోజుల్లో అధికారం మనదే…!

రానున్న రోజుల్లో అధికారం మనదే…!

బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దు

కార్యకర్తలకు అండగా ఉంటా

కొల్లాపూర్ నియోజక వర్గ బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు భీరం హర్షవర్ధన్ రెడ్డి

సీకే న్యూస్ ప్రతినిధి, కొల్లాపూర్:

కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు

ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యి మున్సిపాలిటీ పరిదిలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రజలు మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మాయ మాటల రాజకీయంపై మండిపడుతూ ఆవేదన వ్యక్తం చేశారు

నేటికి కూడా ఆరు గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని వారు తెలిపారు అనంతరం వారు బీఆర్ఎస్ పార్టీ మళ్లీ బలపడడానికి గల సూచనలు మాజీ ఎమ్మెల్యే కు తెలిపారు అలాగే అన్ని వార్డులలో కమిటీ లు ఏర్పాటు చేస్తే పార్టీ బలపడుతుందనీ వారు తెలిపారు

మాజీ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరగా కమిటీలు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో అధికారం మనదేనని వారికి తెలిపారు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో మార్పు మొదలైందని ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు

ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు మంత్రులలో మళ్లీ మార్పు మొదలైందని బీఆర్ఎస్ ఘర్ వాపాసి అంటూ తిరిగి వస్తున్నారని ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల తోనే వారి పతనం ప్రారంభమవుతుందని ఆయన విమర్శించారు రానున్న రోజుల్లో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని ఆయన కార్యకర్తలకు తెలిపారు కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దని గుర్తు చేశారు

నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ అరెస్టులు అక్రమ నిందలు వంటివి జరుగుతున్నాయని వీటికి త్వరలోనే బుద్ధి చెప్తామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button