
పాఠశాలకు మిక్సీ, క్రీడా దుస్తులు వితరణ
పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం,నవంబర్ 14, సీకే న్యూస్.
తను పనిచేస్తున్న పాఠశాల విద్యార్థులకు, వంట ఏజెన్సీ వారికి ఉపయోగపడే వస్తువులను బాలల దినోత్సవం సందర్భంగా వితరణగా అందించిన ఆ ఉపాద్యాయురాలిని ప్రధానోపాధ్యాయులు,సహచర ఉపాధ్యాయ బృందం మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ సభ్యులు ఆ ఉపాద్యాయురాలిని అభినందించారు.
వివరాలు…. మండలం నందలి జిఎల్ఎస్ ఫారం జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఒకటవ తరగతి నుంచి 10 వతరగతి విద్యార్థులు 185 మందికి వంట ఏజెన్సీ సభ్యులు మధ్యాహ్నభోజనం చేస్తున్నారు.
నేపథ్యంలో కొన్ని రోజులుగా వంట చేస్తున్నవారి అవసరాలను గుర్తించి ఆ పాఠశాల గణిత శాస్త్రం ఉపాధ్యాయిని ఆర్.రమ వంట ఏజెన్సీ వారి సౌకర్యం కోసం మిక్సీని శుక్రవారం అందించారు.అదేవిధంగా క్రీడల పట్ల విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపుతుండడంతో 16 మందికి కబడ్డీ దుస్తులు పంపిణీ చేశారు.
దీంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయశేఖర్, క్రీడా ఉపాద్యాయులు సురేష్, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ సభ్యులు బుజ్జమ్మ, లక్ష్మమ్మ, ఉపాద్యాయ బృందం,విద్యార్థులు కలసి గణిత శాస్త్రం ఉపాద్యాయురాలు ఆర్.రమకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.




