
లిక్కర్ రాణి వల్లే కేసీఆర్ ఓటమి, కవితపై బీఆర్ఎస్ క్యాడర్ ఎటాక్ ?
గులాబీ పార్టీని సర్వనాశనం చేసే దిశగా కల్వకుంట్ల కవిత కంకణం కట్టుకుందని కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.
ఆమె తాజాగా వ్యవహరిస్తున్న తీరుపై గులాబీ శ్రేణులు మండిపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కల్వకుంట్ల కవిత చేస్తున్న వరుస కామెంట్లు, గులాబీ పార్టీ క్యాడర్ కు కోపం తీసుకువస్తున్నాయి.
ముఖ్యంగా ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావు పై పదేపదే కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేస్తున్నారు. గులాబీ పార్టీలో కలుపు మొక్క హరీష్ రావు అంటూ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
ఆ పార్టీలో ఉంటూనే కెసిఆర్ కుటుంబానికి వెన్నుపోటు పొడుస్తున్నాడని హరీష్ రావు పై సంచలన ఆరోపణలు కూడా చేశారు కల్వకుంట్ల కవిత. అయితే దీనిపై తాజాగా మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్ హాట్ చేశారు.
కల్వకుంట్ల కవిత కాదు, ఆమె లిక్కర్ రాణి అంటూ ఫైర్ అయ్యారు. అక్రమ సంపాదనలతో లిక్కర్ దందాజులు చేసి గులాబీ పార్టీ అధికారం కోల్పోవడానికి కారణమైంది కవిత కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి మెప్పు కోసం కవిత ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతా అంటే ఇక నుండి ఊరుకునేది లేదని హెచ్చరించారు బీఆర్ఎస్ నేత మల్లికార్జున్ గౌడ్. గురుకుల పాఠశాలలను బాగు చేయాలని కవిత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అని అంటుందన్నారు.
ప్రభుత్వ అసమర్థతలను, తప్పిదాలను ఎత్తి చూపి, గురుకులాలను బాగు చేయాలని డిమాండ్ చేయాలి కానీ రిక్వెస్ట్ చేయడం ఏంటి? అని నిలదీశారు. కవిత పోరాటం ఎవరి మీద? అని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత మల్లికార్జున్ గౌడ్.



