
నటి హేమా ఇంట్లో విషాదం…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నటి హేమ ఇంట్లో కూడా విషాదం చోటు చేసుకుంది.
నటి హేమ తల్లి అనారోగ్య సమస్యల కారణంగా మరణించారని తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హేమ తల్లి కోళ్ల లక్ష్మీ నిన్న రాత్రి అనారోగ్య సమస్యలు కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో మరణించారు. ఇలా తన తల్లి మరణ వార్త తెలుసుకున్న హేమ మంగళవారం ఉదయం స్వగ్రామానికి చేరుకున్నారు
.అయితే తన తల్లి మృతదేహాన్ని చూసి ఈమె బోరున విలపించారు. నిన్న ఉదయం తనతో బాగానే మాట్లాడారని ఇంతలోనే ఈ ఘోరం జరిగింది అంటూ తన తల్లిని చూసి కన్నీటి పర్యంతరమయ్యారు.
శోకసంద్రంలో హేమ..
ఇలా హేమ తల్లి మరణించారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈమెను ఓదారుస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక హేమ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
ఒకానొక సమయంలో తల్లి లేదా పిన్ని, అక్క పాత్రలు అంటే అందరికీ టక్కున హేమ గుర్తుకు వచ్చేవారు. ఇలా ఒకానొక సమయంలో క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపిన హేమ ఇటీవల కాలంలో సినిమాలను పూర్తిగా తగ్గించారనే తెలుస్తుంది.
మరి ఈమెకు అవకాశాలు రాక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారా? లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ఇండస్ట్రీకి దూరమయ్యారా? అనేది తెలియదు కానీ సినిమాలను మాత్రం చాలా వరకు తగ్గించారు.
వివాదంలో నిలిచిన హేమ..
ఇకపోతే హేమ ఇటీవల కాలంలో ఓ వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. బెంగుళూరులో ఒక బర్త్ డే పార్టీ జరుగుతున్న నేపథ్యంలో ఈ పార్టీలో డ్రగ్స్ ఉపయోగిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేసి కొంతమందిని అరెస్టు చేశారు.
ఈ పార్టీలో హేమ కూడా పోలీసులకు పట్టుబడింది అంటూ వార్తలు రావడమే కాకుండా ఈ వివాదంలో తనని అరెస్టు చేసి జైలుకు పంపారు.
కానీ తన తప్పు ఏమీలేదని తెలియడంతో హేమ ఒక్కసారిగా మీడియాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తప్పు లేకపోయిన తన పేరును బయటపెడుతూ చాలా ఇబ్బంది పెట్టారని ఈమె మీడియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినిమాలకు దూరంగా హేమ
ఇలా ఈ ఘటన తర్వాత హేమ పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా సినిమాలకు దూరమైన హేమ పెద్దగా ఇంటర్వ్యూలలోను ఇతర కార్యక్రమాలలో కూడా ఎక్కడ కనిపించడం లేదు.
కేవలం తన వ్యక్తిగత విషయాల ద్వారా బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఈమె మీడియా ముందుకు వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె ఇటీవల కాలంలో పెద్దగా యాక్టివ్ గా కనిపించలేదని చెప్పాలి. ఇక తాజాగా తన తల్లి మరణించడంతో హేమ శోక సంద్రంలో మునిగిపోయారు.



