
మహబూబాబాద్ SP సుధీర్ రాంనాథ్ కేకన్: ధృఢత, దార్హ్యం, ప్రజాసేవకు ప్రతీక!
ఫ్రెండ్లీ పోలీసింగ్ కి పెద్ద పీట
బదిలీపై ములుగు వెళ్తున్న సందర్బంగా మీకు వీడ్కోలు…
మహబూబాబాద్ జిల్లా ఇటీవల కేవలం పరిపాలనా మార్పులతోనే కాదు, పక్కా న్యాయ సంగ్రహ దృష్టితో ముందుకు సాగెందుకు, జవాబుదారీతనాన్ని ఇచ్చిన జిల్లా పోలీస్ సూపరిండెంట్ శ్రీ సుధీర్ రాంనాథ్ ఆర్ కేకన్ బదిలీ చాలా బాధకరం.
సామాన్యంగా ప్రజలకు పోలీసు అంటే భయం అనే భావన ఉంటే, కేకన్ గారి సేవల వల్ల పోలీసు అంటే మిత్ర అనే విదంగా భవిష్యత్తులో మహబూబాబాద్ జిల్లాలో పొంచి ఉన్న నేరాలను, అన్ని రకాల మాఫియాలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వారిని, భద్రతలేని వాతావరణాన్ని మార్చేందుకు ఈ యువ ఐపీఎస్ అధికారి కృషి చేసాడు.
మాఫియాలపై కఠిన హెచ్చరికలు
బదిలీపై వచ్చిన కొత్తలో జిల్లాలో బెల్లం, గుట్కా, బియ్యం, ఇసుక భూమాఫియాతో పోలీస్ వ్యవస్థకు సవాల్ గా అప్పటి రాజకీయ వ్యవస్థ దీటుగా ఉండేది.ఇది గమనించిన ఎస్పీ కేకన్, స్వయంగా సర్వే నిర్వహించి ఈ మాఫియా వ్యవస్థను మట్టికరిపించాలని ప్రతిన పూనాడు. మాఫియాగా ఉండి నేరాలు చేసిన, ఉసిగొల్పిన ఒక్కొక్కర్ని చట్టపరంగా టార్గెట్ చేస్తాం అని స్పష్టం చేయడం, వారిపై ఉక్కుపాదం మోపడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయి.
జిల్లాలో ఎస్పీ రామ్ నాథ్ ఆర్ కేకన్ సర్జికల్ అక్టివిజం ప్రజల్లో విశ్వాసానికి మార్గం కాగా, అన్ని రకాల మాఫియాలకు చెరలు తెరుచుకున్నాయి.ఒకటే దెబ్బలో, అక్రమ రవాణా మార్గాలపై పటిష్ట దాడులు మాఫియాగాళ్ళు చప్పుడు పెద్దగా చేయకుండానే చట్టముందు చేతులెత్తేశారు. బాధ్యత లోపించకుండా కష్టపడి పని చేస్తే పోలీస్ బలగం కూడా “ప్రజా సేవ కోసం” పని చేసే ప్రత్యేక ఏజెన్సీ అవుతుందని పేర్కొనే ఎస్పీ కేకన్ అనేవారు. జిల్లాలో పోలీస్ అధికారుల లోపాలను గట్టిగానే ఎదుర్కొన్నారు. ఇటీవల జరిగిన ఏసీబీ అధికారులు దాడులలో ఒక ఎస్. ఐ, ఒక సీఐ, పట్టుబడడం, ఇద్దరు కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్లోనే మద్యం సేవించారని వచ్చిన ఆరోపణలను నిర్ధారించి, వెంటనే సస్పెన్షన్ చర్యలు చేపట్టారు. కొందరిని సుతి మెత్తగా మండలించడం, కొందరిని తగు హెచ్చరికలు చేయడం, పోలీస్ సంక్షేమం పట్ల శ్రద్ద, వారి కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు, ప్రశ్నించే గొంతుకలతో స్నేహంతో ఉండడం ఆయన ప్రత్యేకత. ఎస్పీ కేకన్ తీరు ఒక పాఠం ప్రజల కోసం మీరు పని చేసి ఉంటే, మేం మీ వెంటే ఉంటాం…తేడా వస్తే చట్టం కఠినంగా ఉంటుందని చెప్పకనే చెప్పేవారు. అంతకు ముందు పని చేసిన ఐపీఎస్ లు కొంత రాజకీయ ప్రభావంతో పని చేసినట్లు ఆరోపణలు ఉండేవి, ఈ ఎస్పీకి అటువంటి నిందలు లేకుండా ఇక్కడ నుండి బదిలీ అవుతున్నారు. కేకన్ దృష్టిలో ప్రజలుకు భద్రత కల్పించటమే కాదు, వారిని చట్టపరమైన అవగాహన కలివిడిగా, నైతికంగా తీర్చిదిద్దటం ముఖ్యం. ఇందుకోసం ఆయన ఇటీవల పిల్లల దినోత్సవం నాడు సామాజిక సందేశాలు ఇవ్వడం, పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అనేక కార్యక్రమాల్లో చేసారు. పిల్లల భవిష్యత్ సురక్షితం చేస్తే వారి భవిష్యత్ బంగారంలా ఉంటుందని ఎప్పుడు ఆయన అంటుంటారు. మన చరిత్రకు బయాన్నిచ్చే ప్రశ్నగా మిగిలిపోకూడదు అంటూ కొన్ని పోస్టులను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆయన పంచుకున్నారు. ప్రజలకు సైతం వాట్సాప్ వేదిక ద్వారా పిర్యాదులు స్వీకరించి పనులు చెక్క బెట్టారు.
మహబూబాబాద్ భవిష్యత్తు చట్టస్వరూపంగా కేకన్ కృషి
మాఫియాలు, మోరల్ సిస్టములో లోపాలు, చిన్ననేరాలు, ప్రశాంత జీవనాన్ని భ్రష్టు పట్టించే హింసాత్మకత ఇవన్నీ నుండి మహబూబాబాద్‌ను కాపాడేందుకు ఎస్పీ కేకన్ ఆయన పోలీస్ బృందం చేసిన కృషి అభినందనీయం. ఒక్క మాటలో చెప్పాలంటే రాము నాథ్ కేకన్ ఉన్నంత వరకూ నేరానికి భయమే…
నమ్మకంమే వృత్తి, తేట తెల్లని ఉన్న వ్యక్తిత్వం
శాంతి ఒక వాగ్దానం కాదు, శ్రమ కన్నా పెద్ద శక్తి. ఈ భావనను పునర్జీవింపజేసినసుధీర్ రాంనాథ్ ఆర్ కేకన్, మహబూబాబాద్ ఎస్పీ గా చరిత్రలో మిగిలిపోతారు. ప్రజల భద్రత, చట్ట ప్రగతి, వ్యక్తిగత వినయం ఇవన్నీ కలగలిపిన సమగ్ర నాయకత్వం ఆయనది. ముందు ముందు ఆయన ప్రభుత్వ ప్రశంశలు, ఎన్నో పదవులు, ఉన్నత శిఖరాలు అవిరోదించాలని ప్రజలు, పోలీస్ సిబ్బంది, పోలీస్ అధికారులు కోరుతున్నారు.
సేవ కార్యక్రమాల్లో పెట్టింది పేరు…
విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ మేళలు, అనాధ పిల్లలను అక్కున చేర్చుకోవడం, ఆర్ధిక సహాయం చేయడం, పోలీస్, జర్నలిస్ట్ ఇంటారెక్ట్ కార్యక్రమాలు, క్రీడలు, యువతతో క్రీడలు ఆడుతు కలిసిపోవడం, పకృతి విపత్తుల సహాయం, ఆదివాసి గుండెల్లో సందర్శన, యూరియా పంపిణిలో ఆయన ముందు చూపు, పేదలతో ఆఫీస్ అయిన క్యాంప్ ఆఫీస్ అయిన ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటూ పోలీసులను పౌర సేవలకు మల్లించడంలో ఎస్పీ రామ్ నాథ్ కేకన్ మార్క్ మహబూబాబాద్ జిల్లా ప్రజలకు ఎప్పుడు మనస్సులో చేరిగిపోదు.
ఆయనకు ఘనంగా వీడ్కోలు
జిల్లా ప్రజల మనస్సు దోచిన ఎస్పీ రామ్ నాథ్ ఆర్ కేకన్ కు ఘనమైన వీడ్కోలు పలకాలి. ఆయనకు రేపటి నుండి వ్యక్తి గతంగా కలిసి, ఆయన సేవలు స్మరించుకొని చెప్పే వీడ్కోలు ఆయనకు భవిష్యత్ లో ఇంకా అధిక సేవ చేయాలనే తపన కలిగిస్తుంది. జిల్లా ప్రజలు ఎస్పీ కేకన్ ను వీడ్కోలు కృతజ్ఞతలు తెలుపండి.
డి. వై. గిరి
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్


