
కాంగ్రెస్ పేదల ఇళ్లపై దాడి… ఖమ్మంలో భగ్గుమనే ఆగ్రహం
ఖమ్మం నగర BRS పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు మండిపాటు
ప్రకాశ్ నగర్ 28వ డివిజన్‌లో రోడ్డు ఎడల్పు పేరిట పేదల ఇళ్లను కూల్చుడే లక్ష్యంగా చేస్తుంది అంటు విమర్శలు
ఖమ్మం ప్రకాశ్ నగర్ 28వ డివిజన్‌లో గత 40 ఏళ్లుగా చెమట చిందించి ఒక్కో ఇటుక వేసుకుంటూ నిర్మించుకున్న పేదల ఇళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కత్తి పెట్టిందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇండ్లను తొలగించాలనే చర్య అసమర్థతతో కూడిన దౌర్జన్యంలా కనిపిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ ప్రాంత రోడ్ విస్తరణ పనుల పరిశీలించేందుకు ఈ రోజు ఖమ్మం నగర BRS పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గుండాల కృష్ణ వెళ్లారు.
పగడాల నాగరాజు మాట్లాడుతూ—
“హైదరాబాద్‌లో ‘హైడ్రా’ పేరుతో బుల్డోజర్లు ఎక్కించి పేదల ఇళ్లను చీల్చి, వేల కుటుంబాలను రోడ్డుపైకి నెట్టిన కాంగ్రెస్… ఇప్పుడు అదే దుష్ట పథకాన్ని ఖమ్మంలో రిపీట్ చేయడానికి చూస్తోంది. అక్కడ బుల్డోజర్, ఇక్కడ రోడ్—కానీ లక్ష్యం మాత్రం ఒకటే: పేదల ఇల్లు నేలమట్టం!” అని మండిపడ్డారు.
పేదల గూడు కూల్చడమే కాంగ్రెస్ డెవలప్మెంట్… పేదల కన్నీళ్లు చూసి నవ్వడమే వారి నాయకత్వం!” అని తీవ్రంగా విమర్శించారు.పేదల ఇళ్లపై కాంగ్రెస్ చేయి వేసిన క్షణమే… BRS ప్రజల పక్షాన పోరాటం ప్రారంభిస్తుంది అని తెలియజేసారు
మాజీ మార్కెట్ కమిటీ చెర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ—
అక్కడ అంత పెద్ద రోడ్డు అవసరం లేకపోయినా ఇళ్లను లక్ష్యంగా చేసుకోవడం కేవలం రాజకీయ ప్రతీకారం, ప్రజలపై కసాయి పాలన!” అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాలో బుల్డోజర్ నడిపిన కాంగ్రెస్… ఖమ్మంలో బుల్డోజర్‌కు బదులు రోడ్లను అడ్డం పెట్టుకుంది ఇది అభివృద్ధి కాదు—పేదలపై యుద్ధం!” అని ఖండించారు.
“ఈ రోడ్డు విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. వెడల్పును 50 అడుగులకు కుదిస్తే ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రజల ఇళ్లు రక్షితంగా ఉంటాయి.” అని తెలిపారు.
ఈకార్యక్రమంలో ధనాల శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ పాలడుగు పాపారావు , కుమ్మర సంఘం అధ్యక్షులు దరిపెల్లి శ్రీను ,ఎర్ర అప్పారావు , కోడి లింగయ్య , కొప్పెరనరసింహారావు, దడాల రఘు , పత్తిపాక రమేష్ బాసెట్టి ఫణి కృష్ణ కొల్లి విద్యాసాగర్ అద్దంకి శివ బాసి పొంగు వెంకటేశ్వరరావు కొల్లి ఉమా మహేష్ సాదు పల్లి వీరేష్ భయ్యా నరేష్ కొఠారి వెంకన్న ఆవుల సైదులు పగడాల సాయి పొదిల అరవింద్ తదితరులు పాల్గొన్నారు



