
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక దాడి కలకలం
అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధిస్తున్నాడని యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన విద్యార్థిని, పగబట్టి విద్యార్థిని ఫెయిల్ చేయించిన అసిస్టెంట్ ప్రొఫెసర్
ఇటీవల కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో పీజీ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థిని, అక్రమంగా పాస్ చేశారని అనేక విమర్శలు రావడంతో, ఈ ఘటనపై విచారణకు కమిటీ వేసిన వైద్యశాఖ అధికారులు
విచారణ సమయంలో సంచలన విషయాలను కనుగొన్నట్లు నివేదిక ఇచ్చిన కమిటీ సభ్యులు
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని, రాత్రి పూట అసభ్యకరంగా మెసేజీలు చేసి వేధించేవాడని తమ విచారణలో కనుగొన్న కమిటీ
ఈ ఘటనపై విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ను విధుల నుండి తొలగించిన యూనివర్సిటీ యాజమాన్యం
దీంతో విద్యార్థినిపై పగ పెంచుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్, జవాబు పత్రాలపై ఇంటూ మార్క్ వేసి, పరీక్షల్లో కావాలనే విద్యార్థినిని ఫెయిల్ చేయించాడని కమిటీకి తెలిపిన యాజమాన్యం
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశానని, ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదని విద్యార్థిని విజ్ఞప్తి మేరకు, ప్రత్యేక పరిస్థితుల్లో ఆమె ఆన్సర్ షీట్ మళ్లీ వాల్యుయేషన్ చేసి పాస్ చేశామని తెలిపిన యూనివర్సిటీ అధికారులు



