
హైదరాబాద్‌లో నకిలీ ఐఏఎస్ హల్చల్
ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ అధికారినని చెప్పుకుంటూ బడాబాబుల దగ్గర డబ్బులు వసూలు
రెండేళ్లుగా దందా సాగుతున్నా నిఘా వర్గాలు గుర్తించకపోవడంతో తీవ్ర విమర్శలు
ఏపీ – నందికొట్కూరుకు చెందిన బత్తిని శశికాంత్(39)గా గుర్తింపు
షేక్‌పేట్‌లోని అపర్ణ ఔరా అపార్ట్మెంట్లో మకాం ఉంటూ ఘరానా మోసం
తమిళనాడుకు చెందిన ఇద్దరు విశ్రాంత సీఆర్పీఎఫ్ జవాన్లను గన్మెన్లుగా పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్న శశికాంత్
చేతిలో వాకిటాకీలు, సైరన్ అమర్చిన కారు.. నకిలీ ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ ఐడీ కార్డులతో హల్చల్
ఓ భూమిని అలైన్మెంట్ చేయిస్తానని జిమ్ ఓనర్ దగ్గర రూ.10.50 లక్షలు.. జిమ్ వెళ్ళే మరో వ్యక్తి దగ్గర రూ.10 లక్షలు వసూలు చేసి తప్పించుకొని తిరుగుతున్న శశికాంత్
మోసపోయామని గ్రహించి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన జిమ్ ఓనర్
దీంతో శశికాంత్ నకిలీ ఐఏఎస్ నాటకం గుట్టురట్టు
అలాగే తాను డిప్యూటీ కమిషనర్(మైన్స్), స్పెషల్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ శశికాంత్ పలువురు వ్యాపారుల వద్ద భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
శశికాంత్‌ను అరెస్ట్ చేసి, రెండు ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, వాకిటాకీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు



