
ఒక్కో కేసుకు ఒక్కో రేటు.. పాతబస్తీ సీఐ వసూళ్ల దందా
కమిషనరేట్ లోపల ఉండే గాడ్ ఫాదర్ అండతోనే రెచ్చిపోతునట్లు ఆరోపణలు
హైదరాబాద్ – పాతబస్తీ సౌత్ వెస్ట్ జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ, విచ్చలవిడిగా అక్రమాలకు, అవినీతి దందాలకు పాల్పడుతున్న సీఐ
భూ దందాలు, నిందితులను కేసు నుండి తప్పించడం, అక్రమాలకు పాల్పడుతున్న ముఠాల నుండి వసూళ్లు చేయడమే సదరు సీఐ పనిగా పెట్టుకున్నాడని స్థానికుల ఆరోపణలు
ఇటీవల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని, స్కూళ్లు, రెస్టారెంట్లు, బార్లు, షాపుల నుండి దాదాపు రూ.20 లక్షలు వసూలు చేసిన సదరు సీఐ
ఇటీవల ఒక పెళ్లి బరాత్‌లో, కత్తులు తిప్పుతూ హల్చల్ చేసిన యువకుల వీడియో వైరల్ అవ్వడంతో, వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఉన్నతాధికారులు
ఈ కేసులో అమాయకులను ఇరికించి, నిందితులను తప్పించేందుకు రూ.2.5 లక్షల లంచం తీసుకున్నట్లు సమాచారం
అర్ధరాత్రి వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను స్టేషన్ కానిస్టేబుళ్లు అరెస్టు చేయగా, సీఐ సదరు కానిస్టేబుళ్లపై మండిపడుతూ ముఠాను ఎలాంటి కేసు లేకుండా వదిలిపెట్టాడని స్టేషన్ సిబ్బంది ఆరోపణలు
అయితే ఇదంతా కమిషనరేట్ లోపల ఉండే తన గాడ్ ఫాదర్ అండతోనే చేస్తున్నాడని చర్చించుకుంటున్న పోలీస్ వర్గాలు
ఇలాంటి అవినీతి పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు



