
డాక్టర్ నిర్లక్ష్యం.. పురిటిలోనే నవజాత శిశువు మృతి
Web desc : నవమాసాలు కడుపులో మోసి తన బిడ్డ భూమి మీదకు వస్తే కళ్ళారా చూసుకోవాలని మురిసిపోయిన ఆ తల్లి ఆశలన్నీ అడియాశలయ్యాయి.
ఎంతో మురిసి పోవాలనుకున్న ఆ గర్భిణీకి చేదు అనుభవం ఎదురైంది. వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా పురిటిలోని మగ బిడ్డను కోల్పోవాల్సిన దురదృష్టం ఆ దంపతులకు ఎదురైంది.
ఎన్నో ముక్కులు మొక్కిన ఎందరో దేవుళ్లకు ముడుపులు కట్టిన కానీ ప్రస్తుతం పిల్లలు పుట్టడం లేదని.. తమపై దయతో ఆ భగవంతుడు ఇచ్చిన ప్రసాదాన్ని ఈ విధంగా కోల్పోవడం చాలా బాధాకరం గా ఉన్నట్టు ఆ కుటుంబమంతా బోరున రోదించారు.
తమ ఇంటికి వారసుడొచ్చాడని ఆశపడి లోపు చేదు అనుభవం ఎదురైంది. వైద్యురాలు నిర్లక్ష్యం చేయడంతో గర్భిణీ తన బిడ్డను కోల్పోయిన సంఘటన శుక్రవారం పాల్వంచలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పాల్వంచలోని విజయ నర్సింగ్ హోమ్ ఆస్పత్రిలో నెహ్రూ నగర్ కు చెందిన పురిటి నొప్పులతో కుంజా భవాని అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఈ నెల 26వ తేదీన ఉదయం 5 గంటలకు ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ లెక్కల ప్రకారం ఈనెల 30న డెలివరీ డేట్ ఇచ్చారు
అయితే ముందే ఆమెకు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు డాక్టర్ విజయలక్ష్మి సింగరేణి ప్రధాని ఆసుపత్రిలో గైనకాలజిస్టు గా పని చేస్తున్నారు. తన సొంత ఆస్పత్రితో పాటు సింగరేణి ఆసుపత్రిలో కూడా ఆమె విధులు నిర్వహిస్తున్నారు.
ఆమె డ్యూటీ కి వెళ్ళిన సమయంలో సదర్ గర్భిణీ కుంజా భవానికి నొప్పులు ఎక్కువ కావడం ఈ విషయం డాక్టర్ కు తెలిపినా ఆలస్యంగా రావడంతో కడుపులోనే మగ బిడ్డ చనిపోయింది. మానవత్వం లేకుండా ఆసుపత్రి ఫీజు కడితేనే పంపిస్తామని యాజమాన్యం చెప్పడంతో బంధువులు ఆందోళనకు దిగారు.
డాక్టర్ నిర్లక్ష్యం చేయడం కారణంగానే తాము మగ బిడ్డను కోల్పోయామని తమకు న్యాయం చేయాలంటూ.. వైద్యురాలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




