
మంత్రి సీతక్క జిల్లాలో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన ప్రజలు
ఇసుక రీచ్ వెంటనే ఆపాలని పురుగుల మందు డబ్బాలతో ప్రధాన రహదారిపై బైఠాయింపు
ఆందోళనకు దిగిన గ్రామస్తులపై దాడి చేసిన ఇసుక సొసైటీ సభ్యులు
ములుగు జిల్లా వెంకటాపురం మండలం అబ్బాయిగూడెంలోని ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా రహదారిపై బైఠాయించి నిరసనకు దిగిన గిరిజనులు, గ్రామస్తులు
ఇసుక లారీల వల్ల పంట పొలాలు, రోడ్లు నాశనం అవుతున్నాయని, వెంటనే ఇసుక రీచ్ ఆపాలని డిమాండ్
గ్రామస్తులపై ఇసుక సొసైటీ సభ్యులు చేసిన దాడిలో గాయపడిన మహిళ, బాధిత మహిళను ఆసుపత్రికి తరలించిన స్థానికులు
ములుగు జిల్లా కలెక్టర్ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ పెద్దలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు



