
భద్రాచలంలో రోజురోజుకి పెరుగుతున్న రౌడీయిజం….
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
డిసెంబర్ 17,
భద్రాచలం చర్ల రోడ్డు వైన్ షాపుల ఎదురుగా మద్యం మత్తులో ఘర్షణ. ఘర్షణలో సజ్జ రవి (పాల్వంచ) అనే వ్యక్తిని మారునాయుధాల తో పొడిచిన యువకులు. ఘర్షణలో తీవ్ర గాయాలు పాలైన సజ్జ రవి.
విషయంలోకి వెళితే రాజుపేట బంధువులు ఇంటికి వచ్చాడు. రెండు బైక్ లు స్వల్పంగా ఢీకొన్న సంఘటనలో గొడవ మొదలు. ఇరు వర్గాలు ఘర్షణ, ఘర్షణలో ముగ్గురు నుండి నలుగురికి తలలు పగిలినట్లు తెలుస్తుంది.
తీవ్ర గాయాలు పాలైన సజ్జ రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన రవి కి ముగ్గురు (3) ఆడపిల్లలు. తండ్రి మృతితో కన్నీరు మున్నీరు అవుతున్న పిల్లలు….. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది


